Sun Dec 14 2025 23:36:29 GMT+0000 (Coordinated Universal Time)
పార్లమెంటులో మరోసారి కలకలం... ముగ్గురు యువకులు
పార్లమెంట్లోకి ప్రవేశించ బోయిన ముగ్గురు అగంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

పార్లమెంట్లోకి ప్రవేశించ బోయిన ముగ్గురు అగంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోకి ప్రవేశించి స్మోక్ బాంబులతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఘటన మరవక ముందే మరోసారి కొత్త పార్లమెంటులోకి కొందరు ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది.
కూలీలుగా...
పార్లమెంటు భవనంలో మరమ్మతు పనులు జరగుుతున్నాయి. ఇందుకోసం ఉత్తర్ప్రదేశ్ నుంచి కూలీలను రప్పించారు. అయితే ముగ్గురు నకిలీ ఆధార్ కార్డులు చూపించి లోపలికి ప్రవేశించబోయారు. పార్లమెంటు మూడో గేటు ద్వారా లోపలకి ప్రవేశించబోవడంతో అధికారులు వారిని అడ్డుకుని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. వీరు ముగ్గురిని ఖాసిం, మోనిష్, షోయబ్ లుగా గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది విచారిస్తున్నారు.
Next Story

