Mon Dec 23 2024 20:14:21 GMT+0000 (Coordinated Universal Time)
ఒవైసీపై అందుకే కాల్పులు జరిపాం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన దుండగులను ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన దుండగులను ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఒవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలు చేయడం వల్లనే కాల్పులు జరిపామని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సందర్బంగా ఒవైసీ హిందువులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రసంగాలు ఉండటంతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.
సీసీ టీవీ....
నిన్న మీరట్ లో ప్రచార సభలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీకి వస్తుండగా కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసు ఇద్దరినీ మరింతగా విచారణ చేయాలని భావిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
Next Story