Tue Dec 17 2024 09:27:15 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
ఢిల్లీకి వస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం చేశారు.
ఢిల్లీకి వస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం చేశారు. రైతులను ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం రైతులు చలో ఢిల్లీకి రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రతాదళాలు ఢిల్లీ సరిహద్దుల్లో మొహరించాయి. సంభూ సరిహద్దులో రైతులను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నించారు.
డ్రోన్ల సాయంతో...
డ్రోన్ల సాయంతో రైతుల ఎటు వైపు వచ్చేది చూసి అటు వైపు భద్రతాదళాలను తరలిస్తున్నారు. యూపీ, హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకుంటుండటంతో వారు కూడా బ్యారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
Next Story