Sun Mar 30 2025 13:03:16 GMT+0000 (Coordinated Universal Time)
విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేసిన యువకుడు అతడే
విమానాలకు బాంబు బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోండియాకు చెందిన జగదీష్ ఉయికేగా అతనిని గుర్తించారు

విమానాలకు బాంబు బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోండియాకు చెందిన జగదీష్ ఉయికేగా అతనిని గుర్తించారు. అతని వయసు 35 సంవత్సరాలు. విమానాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్, మెసేజ్ లు పంపుతూ పౌర విమానయాన శాఖకు నిత్యం తలనొప్పిగా తయారయ్యాడు.
అరెస్ట్ చేసిన...
గోండియాకు చెందిన జగదీష్ ఉయికేను నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. జగదీష్ గతంలో ఉగ్రవాదంపై పుస్తకం రాసినట్లుగా కూడా గుర్తించిన పోలీసులు ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నారు. దేశంలో అనేక విమానాశ్రయాల్లో జగదీష్ బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. జగదీష్ ఉయికే 2021లో ఒక కేసులో అరెస్టయినట్లు గుర్తించారు.
Next Story