Thu Dec 19 2024 16:11:23 GMT+0000 (Coordinated Universal Time)
పాండ్యా బ్రదర్స్ నుంచి 4.3 కోట్లు నొక్కేసింది ఎవరో తెలిస్తే?
యువ క్రికెటర్లు పాండ్యా బ్రదర్స్ ను మోసం చేసిన కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు
యువ క్రికెటర్లు పాండ్యా బ్రదర్స్ ను మోసం చేసిన కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. 4.30 కోట్ల రూపాయల మేరకు మోసానికి పాల్పడటంతో పోలీసులు వైభవ్ పాండ్యాను అదుపులోకి తీసుకున్నారు. ముంబయి పోలీసుల కథనం ప్రకారం హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాకు సమీప బంధువు అయిన వైభవ్ పాండ్య తో కలసి బిజినెస్ ప్రారంభించారు. ఇందుకోసం హార్థిక్ సోదరులు 4.30 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. 2021లో ప్రారంభించిన వ్యాపారానికి పాండ్యా సోదరులు సహకరించి నలభై శాతం పెట్టుబడిగా పెట్టారు.
వ్యాపారంలో నష్టం వచ్చిందని...
వ్యాపారాన్ని వైభవ్ పాండ్యా మాత్రమే చూసుకుంటున్నారు. అయితే వీరికి తెలియకుండా వైభవ్ సొంతంగా మరో పాలిమర్ బిజినెస్ ను ప్రారంభించాడు. పాండ్యా సోదరులతో కలసి చేసిన వ్యాపారంలో మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు చూపించారు. సంస్థకు చెందిన ఖాతా నుంచి 4.3 కోట్ల రూపాయలను తన ఖాతాలోకి మళ్లించుకోవడంతో పాండ్యా సోదరులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైభవ్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
Next Story