Fri Mar 14 2025 01:08:56 GMT+0000 (Coordinated Universal Time)
యాభై గంటల నుంచి వెదుకులాట.. నిందితుడు ఎక్కడ?
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు యాభై గంటలుగా వెతుకుతున్నారు

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు యాభై గంటలుగా వెతుకుతున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ముంబయి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే వీరు అసలు నిందితుడు కాదని కొందరు చెబుతున్నారు. నిందితుడు చొక్కాలు మార్చి తిరుగుతుండటంతో ముంబయిలో పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ప్రత్యేక బృందాలు...
ప్రత్యేక బృందాలు సైఫ్ ఆలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం ప్రయత్నిస్తున్నాయి. ముంబయి నలుమూలలకు వెళ్లి నిందితుడి కోసం గాలిస్తున్నారు. భుజాన సంచీతో ఉన్న ఆ నిందితుడిని సైఫ్ ఆలీఖాన్ ఇంట్లో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంత వరకూ పోలీసులు నిందితుడిని పట్టుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Next Story