Sun Dec 22 2024 11:26:02 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూకాశ్మీర్‌లో కాల్పులకు తెగబబడింది వారేనట
జమ్మూకాశ్మీర్‌లోని గాదంబర్ జిల్లాలో జరిగిన ఘటన వెనక టీఆర్ఎఫ్ ఉందని పోలీసులు గుర్తించారు.
జమ్మూకాశ్మీర్‌లోని గాదంబర్ జిల్లాలో జరిగిన ఘటన వెనక టీఆర్ఎఫ్ ఉందని పోలీసులు గుర్తించారు. ఈ ఉగ్రవాద దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. శ్రీనగర్ - లేహ్ జాతీయ రహదారి నిర్మాణపనుల కోసం వీరు పనిచేస్తున్నారు. ఒక సొరంగ నిర్మాణ పనులను చేస్తున్న ప్రయివేటు కార్మికులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
ఇద్దరు ఉగ్రవాదుల కోసం...
ఇద్దరు ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడినట్లు గుర్తించారు. లష్కేరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ కాల్పులకు ప్రధాన కారణమని తెలిసింది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు జల్లెడ వేసి మరీ గాలిస్తున్నాయి. ఆ ప్రాంతంలో అలెర్ట్‌ను ప్రకటించారు. కార్మికులు పనిని ముగించుకుని తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
Next Story