Mon Dec 15 2025 03:52:15 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి.. అతని ఉనికి కోసమేనంటున్న ఇంటెలిజెన్స్
పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉన్న స్టేషన్ పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు..

పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గర్లో ఉన్న పంజాబ్ లోని తరణ్ తరణ్ లోని ఓ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి జరిగింది. ఉగ్రవాదులు ఓ తేలికపాటి రాకెట్ తో దాడి చేశారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో స్టేషన్ కు, సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. కాగా.. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉన్న స్టేషన్ పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు సందేహిస్తున్నాయి. దాంతో పంజాబ్ పోలీసులు అప్రమత్తమై.. అన్ని పోలీస్ స్టేషన్లనూ అలర్ట్ చేశారు. అయితే ఇటీవల రిండా మరణించినట్లు వార్తలొచ్చాయి. కానీ.. ఈ వార్తలను పోలీసులు ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో రిండా ప్రాణాలతో ఉండాలని ఐఎస్ఐ కోరుకుంటోందని, రిండాకు హాని తలపెట్టొద్దనే హెచ్చరిక పంపేందుకే రిండా సొంతూరిలో తాజా రాకెట్ దాడి జరిపినట్లు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
Next Story

