Mon Nov 18 2024 01:49:56 GMT+0000 (Coordinated Universal Time)
Polling : నేడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలో పోలింగ్
నేడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమయింది
నేడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమయింది. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్ లో ఒకే దశలో, ఛత్తీస్‌గఢ్ లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గడ్ లో నవంబరు 7వ తేదీన మొదటి దశలో 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు రెండో దశ పోలింగ్ ప్రారంభమయింది. ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల సమస్య కారణంగా పోలింగ్ శాతం ఎంత శాతం జరుగుుతుందన్న అనుమానాలు తలెత్తాయి. అయితే తొలి దశలో 76,47 శాతం పోలింగ్ రిగింది.
పోలింగ్ సందర్భంగా...
ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొంది. రెండు రాష్ట్రాల్లోనూ జాతీయ పార్టీలే అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన దిండోరి జిల్లాలో మాత్రం మూడు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోనూ విస్తృతమైన తనిఖీలు చేస్తున్నారు. అన్నీ తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి పంపుతున్నారు ఓటర్లు పెద్దయెత్తున బారులు తీరారు.
Next Story