Fri Dec 20 2024 06:08:48 GMT+0000 (Coordinated Universal Time)
దీపావళి పండగపై ఆంక్షలు
దీపావళి పండగపై ఆంక్షలు విధిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీన దీపావళి పండగ జరగనుంది
దీపావళి పండగపై ఆంక్షలు విధిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీన దీపావళి పండగ జరగనుంది. ఈ పండగకు దేశ వ్యాప్తంగా ప్రజలు రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీపావళి టపాసుల ద్వారా అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగుతుందని, ప్రజలు సహకరించాలని కోరింది.
ఆ రెండు గంటలే...
దీపావళి రోజు ఉదయ ఆరు నుంచి ఏడు గంటల వరకూ, రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకూ మాత్రమే టపాసులు కాల్చుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి కోరింది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరింది. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలకు వెనకాడవద్దని కోరింది. భారీ శబ్దాలు, పొగ వచ్చే టపాసులను ప్రజలు కొనుగోలు చేయవద్దని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచించింది.
Next Story