Mon Dec 23 2024 07:26:57 GMT+0000 (Coordinated Universal Time)
Poonam Pandey : సంచలనం కావాలన్నా.. పాపులర్ మరింత అవ్వాలన్నా ఇలా చేయాలా తల్లీ?
పూనమ్ పాండే బతికే ఉన్నారు. నిన్న చనిపోయినట్లు ప్రకటించిన ఆమె నేడు తాను బతికే ఉన్నానంటూ వీడియో పోస్టు చేశారు.
పూనమ్ పాండే బతికే ఉన్నారు. నిన్న చనిపోయినట్లు ప్రకటించిన ఆమె నేడు తాను బతికే ఉన్నానంటూ వీడియో పోస్టు చేశారు. కానీ ఇదేమీ ఖర్మమో కాని.. పూనమ్ చెప్పిన క్లారిటీ విన్నోళ్లకు మైండ్ బ్లాంక్ అయింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన పెంచడానికే తాను చనిపోయినట్లు వార్తలు సృష్టించానని చెప్పడం మరింత సిగ్గుచేటు. దీనిపై దేశ వ్యాప్తంగా అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ చేసిన పని సరికాదని, ఇలాంటి సంచలన వార్తలు క్రియేట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్ కూడా వినపడుతుంది.
మేనేజర్ పోస్టుతో...
నిన్న తెల్లవారు జామున బాలీవుడ్ నటి పూనమ్ చనిపోయినట్లు ఆమె మేనేజర్ ఇన్స్టా ద్వారా పోస్టు చేశారు. అప్పుడే కొంత డౌట్ వచ్చింది. అధికార ప్రకటన ఆమె కుటుంబ సభ్యుల నుంచి రాలేదు. అయితే ఇది చూసిన అనేక మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. 34 ఏళ్ల వయసులో చనిపోయిందా? అంటూ బాధపడ్డారు కూడా. ఇక సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారంటే ఆమె అందరినీ ఎలాంటి వార్తతో ఇబ్బంది పెట్టిందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా అనుమానం వచ్చినా మేనేజర్ పోస్టు చేయడంతో నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది.
బతికే ఉన్నానంటూ...
ఈరోజు ఆమె తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. అదేదో పెద్ద ఘన కార్యం చేసినట్లు ఫీలవుతుంది. సర్వేకల్ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడానికే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇంత అతి అవసరమా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సర్వేకల్ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడంలో తప్పులేదు. అందుకు వేర్వేరు మార్గాలున్నాయి. ఎప్పుడూ వివాదాలను ఆశ్రయిస్తూ ప్రచారం కోసం పాకులాడే ఈ ముద్దుగుమ్మ చివరకు తాను మరణించినట్లు ప్రకటించుకోవడం విడ్డూరంగానే కాదు.. విస్మయానికి గురి చేసింది. ప్రజలకు మరింత చేరువవ్వాలంటే బోలెడు మార్గాలున్నాయి. అభిమానుల సంఖ్య పెంచుకోవాలన్నా వేరే దారులున్నాయి. వాటిని వదిలేసి ఇలా తప్పుడు వార్తలు ప్రచార చేసుకోవడానికి సర్వేకల్ క్యాన్సర్ పట్ల అవగాహనా? లేక సొంత ప్రచారానికా? అన్న కామెంట్లు, పోస్టుల బాగా వినపడుతున్నాయి.
Next Story