Mon Dec 23 2024 08:59:30 GMT+0000 (Coordinated Universal Time)
రూ.100 కోట్లు నష్టం తెచ్చిన పిల్లి.. ఇంతకీ ఏం జరిగింది ?
దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అది పారిశ్రామిక ప్రాంతం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇండస్ట్రియల్ ఏరియాలో ..
పూణె : ఒక పిల్లి చేసిన పనికి మహారాష్ట్రకు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇంతకీ ఆ పిల్లి ఏం చేసింది ? పిల్లి వల్ల ప్రభుత్వానికి అంతపెద్ద మొత్తంలో ఎలా నష్టం వచ్చింది ? తెలుసుకుందాం. మహారాష్ట్రలోని పూణెలో పింప్రిచించ్ వాడ్ లో జరిగిందీ ఘటన. పిల్లి కారణంగా ఏకంగా 60 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భోసరీ, భోసరీ ఎంఐడీసీ, ఓకుర్ది ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా అంధకారంతో ఇబ్బందులు పడ్డారు. 7వేల వ్యాపార సముదాయాలకు పవర్ కట్ అవ్వడంతో.. సుమారు వందకోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది.
పింప్రిలోని భోసారి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 220కేవీ సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ ఎక్కింది ఓ పిల్లి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆ పిల్లి అక్కడే చనిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అది పారిశ్రామిక ప్రాంతం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇండస్ట్రియల్ ఏరియాలో పవర్ కట్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు భోసరీ MIDCఎ వ్యాపారులు. ఇది MSEDCLఅధికారుల నిర్వహణ లోపమని, పవర్ కట్ ద్వారా తమ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, సుమారు వంద కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తోంది పింప్రి-చించ్వడ్ స్మాల్ కేర్ ఇండస్ట్రీస్ సంఘం.
ఈ అంశంపై విద్యుత్తు శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి సమస్యను వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా.. మరో మూడ్రోజులు పవర్ కట్ కొనసాగవచ్చంటున్నారు అధికారులు. ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తున్నామని.. ప్రత్యామ్నాయమార్గాల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్తున్నారు. ఒకే ట్రాన్స్ఫార్మర్పై లోడ్ మొత్తం పడుతున్నందున ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని MSEDCLఅధికారులు విజ్ఞప్తి చేశారు.
Next Story