Fri Dec 27 2024 04:27:40 GMT+0000 (Coordinated Universal Time)
Liquor Ban అధికారం లోకి రాగానే గంటలో లిక్కర్ బ్యాన్ ను ఎత్తేస్తా!!
అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఒక గంటలోపు
బీహార్లో అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఒక గంటలోపు రద్దు చేస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. తన పొలిటికల్ పార్టీని ప్రారంభించడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం మద్యపాన నిషేధం ఎందుకీ పనికిరాదని విమర్శించారు. మద్యం అక్రమంగా ఇళ్లకు చేరుకుంటూ ఉందని, రాష్ట్రం 20,000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయాన్ని కోల్పోయిందని అన్నారు.
అక్రమ మద్యం వ్యాపారంతో రాజకీయ నాయకులు, అధికారులు లబ్ధి పొందుతున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఇతర పార్టీల లాగా మహిళల ఓట్లు తమకు తమకు పడవని భయపడే విధానానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వెనుకాడబోనని కిషోర్ తెలిపారు.
బీహార్ దుస్థితికి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ కారణమని నమ్ముతానన్నారు ప్రశాంత్ కిషోర్. అక్టోబర్ 2న ప్రారంభం కానున్న తన రాజకీయ పార్టీ 'జన్ సూరాజ్' వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని ధృవీకరించారు. పొలిటికల్ అనలిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ దేశ వ్యాప్తంగా పాపులర్. ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకుల కోసం పని చేశారు. ఏపీలో వైఎస్ జగన్ కోసం ప్రచారం చేసి కీలక వ్యక్తిగా మారాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ఓడిపోబోతున్నారని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే.

Next Story