Wed Apr 23 2025 09:32:18 GMT+0000 (Coordinated Universal Time)
36వ రోజుకు చేరుకున్న మహాకుంభమేళా
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా నేటితో 36వ రోజుకు చేరుకుంది.

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా నేటితో 36వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే యాభై కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహా కుంభమేళా ఈ నెల 26వ తేదీతో ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. భక్తులు అధిక మంది వస్తారని భావించి అందుకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు చేశారు.
తొక్కిసలాట తర్వాత...
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినా ఇటీవల తొక్కిసలాట జరిగి కొందరు మరణించడంతో ఘాట్ ల వద్ద మరింత బందోబస్తును ఏర్పాటు చేసింది. భక్తులు పుణ్యస్నానాలు చేసి తరించాలని భావించి ఈ వారం రోజుల్లో ఎక్కువ మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మొత్తం భక్తుల సంఖ్య అరవై కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.
Next Story