Tue Apr 01 2025 06:31:05 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి కొత్త గవర్నర్ నియామకం
దేశంలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియామకం చేశారు

దేశంలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియామకం చేశారు. కొందరి గవర్నర్ల రాజీనామాను ఆమోదించారు. మహారాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ కోష్యారీ, లడఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ గా రాధాకృష్ణన్ రాజీనమాలను రాష్ట్రపతి ఆమోదించారు. పలు రాస్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ఘడ్ గవర్నర్ గా నియమించారు. ఆయన స్థానంలో ఎస్ అబ్దుల్ నజీర్ ను నియమించారు.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
జార్ఖండ్ గవర్నర్గా రాధాకృష్ణన్
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా శ్ర శివ ప్రతాప్ శుక్లా
అస్సాం గవర్నర్గా శ్రీ గులాబ్ చంద్ కటారియా
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఎస్ అబ్దుల్ నజీర్
ఛత్తీస్గఢ్ గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్
మణిపూర్ గవర్నర్ గా సుశ్రీ అనసూయ
నాగాలాండ్ గవర్నర్ గా గణేశన్
మేఘాలయ గవర్నర్ గా ఫాగు చౌహాన్
బీహార్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథన్
మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బైస్
లడఖ్ లెఫ్ట్్నెంట్ గవర్నర్గగా బి.డి. మిశ్రా
Next Story