Wed Nov 20 2024 17:30:00 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్
దేశంలో ఈరోజు బంగారం ధర తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.
బంగారం అంటేనే డిమాండ్. దాని మార్కెట్ ఎప్పుడూ పడిపోదు. బంగారానికి ఉన్న విలువ అలాంటిది. ప్రధానంగా భారత్ లో బంగారానికి ఉన్న విలువ దేనికీ లేదు. భూమికి విలువ ఉన్నా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మహిళలు బంగారం అంటే పడి చచ్చిపోతారు. తాము దాచుకున్న కొద్ది మొత్తాన్ని బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారు. ఒక్కొక్క గ్రామును వాళ్లు అపురూపంగా చూడటంతోనే అంత డిమాండ్ ఏర్పడింది.
తగ్గిన ధరలు....
దేశంలో ఈరోజు బంగారం ధర తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. తులం బంగారంపై రూ.400 తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,200 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర స్వల్పంగా 65,100 రూపాయలుగా ఉంది.
Next Story