Mon Dec 23 2024 09:20:54 GMT+0000 (Coordinated Universal Time)
వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
మే నెలలో కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా రూ.171.50 తగ్గించగా..రూ.2028 నుంచి ఒక్కసారిగా రూ.1856.5కు దిగొచ్చింది. ఏప్రిల్ లో..
వరుసగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మండిపోతున్న కూరగాయల ధరలతో జేబుకు చిల్లు పడుతుంటే.. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు షాకిచ్చాయి. జులై నెలకు సంబంధించి చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రకటించాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉండగా.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.7 పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1780కి చేరింది. మూడు నెలల తర్వాత చమురు సంస్థలు సిలిండర్ ధరను స్వల్పంగా పెంచాయి.
మే నెలలో కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా రూ.171.50 తగ్గించగా..రూ.2028 నుంచి ఒక్కసారిగా రూ.1856.5కు దిగొచ్చింది. ఏప్రిల్ లో సిలిండర్ ధరపై రూ.91.5 తగ్గించింది. తాజాగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.7 పెరగడంతో సిలిండర్ ధర రూ.1780కి చేరింది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1103గా ఉంది. డొమెస్టిక్ సిలిండర్ 14 కేజీల ధర మార్చి 1న రూ.50 పెరగ్గా.. అప్పటి నుంచీ స్థిరంగా కొనసాగుతోంది. కాగా.. స్వల్పంగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర ప్రభావం సామాన్యుడిపై పరోక్షంగా పడనుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తారని తెలిసిందే. ఇప్పటికే పెరిగిన కూరగాయల ధరలతో.. టిఫిన్లు, మీల్స్ రేట్లు పెరగగా .. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడంతో హెటల్ ఫుడ్ ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
Next Story