Mon Nov 18 2024 10:49:24 GMT+0000 (Coordinated Universal Time)
దిగి వచ్చిన బంగారం ధరలు
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.150లు తగ్గింది.
బంగారం ధరల్లో మార్పులు సహజం. అనేక కారణాలతో బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే ధరలతో సంబంధం లేకుండానే కొనుగోళ్లు జరుగుతుంటాయి. వినియోగదారుల అవసరం, వారి వద్ద తగిన డబ్బు ఉంటే చాలు బంగారం కొనుగోలుకు ఒక వేళాపాళా ఉండదు. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా ముగిసింది. శ్రావణమాసం కూడా పూర్తయింది. అయినా బంగారం కొనుగోళ్లు తగ్గవని వ్యాపారులు ధీమా వ్యక్తం చేస్తుంటారు. బంగారానికి భారత్ లో ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారం ఒక పెట్టుబడిగా చూసినంత కాలం ఆ వ్యాపారానికి ఎటువంటి ఢోకా లేదు. అందులో సందేహం లేదు. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయడానికి నిర్దిష్ట సమయమేదీ పెట్టుకోరన్నది మార్కెట్ నిపుణులు కూడా అంగీకరిస్తున్న విషయం. ఇక బంగారం ధరలు ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటాయి.
ఈరోజు ధరలు...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.150లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,430 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,150 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి పై రూ.800లు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి 60,000 రూపాయలు ఉంది.
Next Story