Mon Nov 18 2024 22:30:44 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. బంగారం ధర తగ్గింది
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై 300 రూపాయలకు పైగానే తగ్గింది.
బంగారం ధర తగ్గినా పెరిగినా.. డోన్ట్ కేర్... ఒక ప్రముఖ జ్యుయలరీ సంస్థ ప్రకటన ఇది. ఇందులో 100 శాతం వాస్తవం ఉంది. ధర గురించి ఎవరూ లెక్క చేయడం లేదు. తమ వద్ద డబ్బులు ఉన్నప్పుుడు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. పెట్టుబడిగా భావించి బంగారాన్ని స్థాయికి మించి కొనుగోలు చేసే వాళ్లు కూడా లేకపోలేదు. భారత్ లో అందుకే బంగారానికి అంత డిమాండ్ ఉంటుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో బంగారానికి ఉన్న విలువ మరే వస్తువుకు లేదు. ఇంటి స్థలాలతో సమానంగా బంగారాన్ని కొనుగోలు చేసి దాచి పెట్టుకుని అనువైన రేటుకోసం ఎదురు చూసే వారు మరికొందరు. అందుకే బంగారం అంత ప్రియమయిపోయింది.
వెండి కూడా...
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై 300 రూపాయలకు పైగానే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,780 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,580 రూపాయలుగా ఉంది. ఇక వెండి కూడా కూడా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 60,800 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Next Story