Mon Dec 23 2024 11:24:36 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మోదీ మెగా రోడ్ షో
కర్ణాటకలో నేడు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. నగరంలోని పదిహేడు నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ రోడ్ షో ఉండనుంది
కర్ణాటకలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. నగరంలోని పదిహేడు నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ రోడ్ షో ఉండనుంది. మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో నిర్వహించనున్నారు. బెంగళూరు నగరంలో ఈ రోడ్ షో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
భారీ ఏర్పాట్లు...
ఇందుకోసం భారీ ఏర్పాట్లను కర్ణాటక బీజేపీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రధాని మోదీ తన రోడ్ షో ద్వారా ప్రజలను బీజేపీ వైపునకు తిప్పుకునేలా ఈ రోడ్ షో సాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు కూడా 8.5 కిలోమీటర్ల మేర సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో ఉంటుందని తెలిపాయి.
Next Story