Mon Dec 23 2024 16:57:57 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ భావోద్వేగ ట్వీట్
ప్రధాని మోదీ తల్లి హీరీబెన్ మృతి చెందారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆమె అర్ధరాత్రి కన్ను మూశారు.
ప్రధాని మోదీ తల్లి హీరీబెన్ మృతి చెందారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆమె అర్ధరాత్రి కన్ను మూశారు. అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. హీరాబెన్ మృతితో మోదీ విషాదంలో మునిగిపోయారు. హీరాబెన్ ఇటీవలే వందో పుట్టిన రోజు జరుపుకున్నారు.
సంతాపం తెలిపిన...
తల్లి హీరాబెన్ మృతి పై మోదీ భావోద్వేగానికి గురయ్యారు. "నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని నా తల్లి ఈశ్వరుడి పాదాల వద్దకకు చేరుకుంది. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది" అని మోదీ ట్వీట్ చేశారు. మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
Next Story