Tue Nov 19 2024 10:28:40 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ పర్యటనలో భద్రత వైఫల్యంపై "సుప్రీం" కీలక నిర్ణయం
ప్రధాని మోదీ భద్రత వైఫల్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు దీనిపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
పంజాబ్ లో ప్రధాని మోదీ భద్రత వైఫల్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు దీనిపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ లో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఏర్పాటు చేసిన అన్ని కమిటీల విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము విచారణ కోసం కమిటీని వేస్తున్నట్లు తెలిపింది.
రిటైర్డ్ జడ్జితో.....
ఈ మేరకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీని నియమిస్తున్నట్లు తెలిపింది. ఇందులో సభ్యులుగా చండీగడ్ డీజీపీ, ఎన్ఐఏ ఏజీ, పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అడిషనల్ డీజీలు ఉంటారని పేర్కొంది. ఈ కమిటీయే జరిగిన ఘటన పై విచారణ జరుపుతుందని పేర్కొంది. కాగా మోదీ కాన్వాయ్ ఆగిపోవడానికి పంజాబ్ పోలీసుల వైఫల్యమేనని కేంద్ర ప్రభుత్వం వాదించింది. మోదీ కాన్వాయ్ కు వంద మీటర్ల దూరంలోనే ఆందోళనకారులు ఉన్నారని పేర్కొంది. కానీ పంజాబ్ ప్రభుత్వం మాత్రం దీనిని తిప్పికొట్టింది. ఎటువంటి వైఫల్యం లేదని, రాజకీయం చేసేందుకు చూస్తున్నారని పంజాబ్ ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు.
Next Story