Mon Dec 23 2024 19:59:58 GMT+0000 (Coordinated Universal Time)
మోదీతో కలిసి పానీపూరీ తిన్న జపాన్ ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదా కలసి సరదాగా పర్యటించారు. ఇద్దరూ కలసి పానీపూరీ తిన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదా కలసి సరదాగా పర్యటించారు. రాష్ట్రపతి భవన్ వెనక ఉన్న సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని బుద్ధుడి పార్కులో షికారు చేశారు. బుద్ధ జయంతి సందర్భంగా ఇద్దరూ బుద్ధ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదాకు బోధి వృక్షం మొక్కను బహుకరించారు.
రుచి చూసి...
అయితే వారు పర్యటిస్తున్న పార్క్ లో వివిధ రకాల భారతీయ తినుబండారాలను ఏర్పాటు చేశారు. అందులో పానీపూరీని ఇద్దరూ తిన్నారు. వీటితో పాటు భారతీయ వంటకాలైన వేయించిన మామిడికాయల గుజ్జు రసాన్ని కూడా తాగారు. దీంతోపాటు లస్సీని కూడా రుచి చూశారు. తర్వాత వేడి వేడి టీ తాగారు. ఇద్దరూ కలసి కాసేపు అంతర్జాతీయ విషయాలపై ముచ్చటించుకున్నారు. జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదా రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.
Next Story