Sun Dec 22 2024 07:52:27 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 29న ఒరిస్సాకు మోదీ, అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఒరిస్సాలో పర్యటించనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఒరిస్సాలో పర్యటించనున్నారు. ఈ నెల 29, 30, డిసెంబరు 1 తేదీల్లో భువనేశ్వర్ లోక్ సేవాభవన్ వేదికగా మూడు రోజులపాటు డీజీపీల సదస్సులు జరగనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో మోదీ, అమిత్ షా పాల్గొననున్నారు. ఒరిస్సా పర్యటనకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ఖరారయినట్లు బీజేపీ అధ్యక్షుడు గోలక్ మహాపాత్ర మీడియాకు తెలిపారు.
కీలక అంశాలపై...
ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా దేశ భద్రత, ఉగ్రవాదం, మావోయిస్టులను తుదముట్టించాలన్న ధ్యేయంతో సదస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బీఎస్ఎఫ్, రా, ఇంటెలిజెన్స్, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. సమావేశానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Next Story