Mon Dec 23 2024 13:39:19 GMT+0000 (Coordinated Universal Time)
మోదీకి అరుదైన గౌరవం
ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది
ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది. అబుదాబికి వెళ్లిన ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. ప్రొటోకాల్ పక్కన పెట్టి మరీ ఆయన విమానాశ్రయానికి వచ్చి మోదీని ఆలింగనం చేసుకున్నారు. అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల వ్యక్తిగతంగా సంతాపాన్ని తెలిపేందుకు ప్రధాని మోదీ యూఏఈ వెళ్లారు.
జర్మనీ నుంచి...
జర్మనీలో జరిగిన జీ 7 సమ్మిట్ కు హాజరైన ప్రధాని మోదీ అనంతరం అబుదాబీకి చేరుకున్నారు. అక్కడ నేతలతో సంభాషించారు. షేక్ ఖలీఫా మృతికి సంతాపం ప్రకటించారు. కాసేపు అబుదాబి నేతలు, అధికారులతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Next Story