Mon Dec 23 2024 17:15:36 GMT+0000 (Coordinated Universal Time)
అతి పెద్ద వంతెనను ప్రారంభించిన మోదీ
ముంబయిలో దేశంలోనే అతి పెద్ద వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ముంబయిలో దేశంలోనే అతి పెద్ద వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయి ట్రాన్స్ హార్బర్ లింగ్ ను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్గడ్ జిల్లాలోని నవా వేవాను కలుపుతూ 21 వేల కోట్ల రూపాయలతో 21కిలోమీటర్ల మేర నిర్మించిన వంతనను ప్రారంభించడంతో ముంబయి - నవీ ముంబయికి మధ్య ప్రయాణం చాలా తగ్గింది.
పదిహేను నిమిషాలే...
గతంలో గంటకు పైగానే పట్టే ప్రయాణ సమయం ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణంతో పదిహేను నిమిషాలకు చేరుకుంది. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నాసిక్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. రెండు కిలోమీటర్ల ఈ రోడ్ షా దాదాపు నలభై నిమిషాలకు పైగా సాగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాధ్ షిండేతో పాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పాల్గొన్నారు.
Next Story