Mon Dec 23 2024 08:27:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఉత్తరాఖండ్ కు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరిక లేకుండా రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. ఈరోజు ఆయన ఉత్తరాఖండ్ లో పర్యటిస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరిక లేకుండా రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. ఈరోజు ఆయన ఉత్తరాఖండ్ లో పర్యటిస్తారు. ఉత్తరాఖండ్ లో మోదీ దాదాపు 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీని మోదీ తొలుత సందర్శిస్తారు. 17,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపలను ప్రధాని మోదీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రతిష్టాత్మకమైన....
ఇందులో 17 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. నీటిపారుదల, రహదారులు, జలవిద్యుత్తు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. . ఇక ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ , హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ వంటి ఆరు రాష్ట్రాలకు తాగు నీరు అందించే లఖ్వార్ మల్టీపర్పస్ ప్రాజెక్టును ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీనివల్ల ఆరు రాష్ట్రాలకు తాగు నీరు మాత్రమే కాకుండా సాగునీరు, 300 మెగావాట్ల జలవిద్యుత్పత్తి జరగనుంది.
- Tags
- modi
- uttarakhand
Next Story