Fri Dec 20 2024 19:48:51 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్లో ప్రధాని పర్యటన
నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు
నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో వరసగా ప్రధాని ఆ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్ లలో మూడు రోజుల పాటు ప్రధాని పర్యటన ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం వర్గాలు వెల్లడిచాయి. ఈ మూడు రోజుల్లో 14,500 కోట్ల రూపాయల విలువైన వివిధ రకాల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
సౌర విద్యుత్తు గ్రామంగా...
నేడు గుజరాత్ లో దేశంలోని తొలిసారి సౌర విద్యుత్తు గ్రామంగా మోధేరాను ప్రధాని ప్రకటించనున్నారు. ఈ నెల 11వ తేదీ వరకూ ప్రధాని పర్యటన కొనసాగుతుంది. 11న మధ్యప్రదేశ్ లో ఆయన పర్యటించనున్నారు. గుజరాత్ లోని మోధేరీలోని సన్ టెంపుల్ టౌన్ సోలారైజేషన్ చేయాలని ఆయనకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది. ఆ కోరిక నేడు నెరవేరనుంది. మోధేరా గ్రామం అంతటా సోలార్ విద్యుదీకరణ పూర్తయింది. ఈ గ్రామంలో 6,373 మంది జనాభా ఉన్నారు. ఈరోజు, రేపు గుజరాత్ లోని బరూచ్, అహ్మదాబాద్, జామ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Next Story