Mon Dec 23 2024 09:13:25 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త రూ.20లు నాణేలు వచ్చేస్తున్నాయ్
ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నాణేలను ప్రారంభించారు.
ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నాణేలను ప్రారంభించారు. కొత్త నాణేలు త్వరలో మార్కెట్ లోకి చలామణిలోకి రానున్నాయి. ఈ నాణేలపై ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లోగోను ముద్రించారు. రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు, ఇరవై రూపాయల నాణేలపై వీటిని ముద్రించారు.
త్వరలోనే మార్కెట్ లోకి....
వీటిని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ నాణేలు త్వరలోనే మార్కెట్ లోకి చలామణిలోకి వస్తాయని చెబుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో పాటు జన సమ్మర్ద్ పోర్టల్ ను కూడా మోదీ ప్రారంభించారు. పన్నెండు ప్రభుత్వ పథకాలతో దీనిని రూపొందించారు.
Next Story