Mon Dec 23 2024 05:34:25 GMT+0000 (Coordinated Universal Time)
మెట్రోలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన రోజున విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆయన ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు
ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆయన ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సెల్ఫీలు దిగేందుకు అనేక మంది పోటీ పడ్డారు. యువతీ యువకులతో పాటు ప్రజలు ఆయనతో ఫొటో దిగేందుకు ఉత్సాహపడిన వారందరికీ ఆయన అవకాశమిచ్చారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 21 నుంచి కొత్త మెట్రో స్టేషన్ ను సెక్టార్ 25 వరకూ ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ ను పొగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు చేతివృత్తి కళాదారుల వద్దకు వెళ్లి వారితో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.
చేతివృత్తుల వారి వద్దకు...
ఈ సందర్భంగానే న్రధాని నరేంద్ర మోదీ రైలులో ప్రయాణించారు. ఒక్కసారి రైలులోకి ప్రధాని రావడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. తమ పిల్లలు, తాము ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అందరికీ ఓపిగ్గా ప్రధాని ఫొటోలు తీసుకునేందుకు అనుమతిచ్చారు. దీంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అంతకు ముందు విశ్వకర్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెప్పులు కుట్టేవారు, టైలర్, సఫాయి కర్మచారి కార్మికుకల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడిన మోదీ వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పలు కార్యక్రమాలను చేపట్టాయి.
Next Story