Mon Dec 23 2024 14:20:00 GMT+0000 (Coordinated Universal Time)
Modi : కన్యాకుమారిలో మోదీ.. రేపటి వరకూ ధ్యానం
ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో ధ్యానంలో ఉన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో ధ్యానంలో ఉన్నారు. నిన్న తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్న మోడీ రేపటి వరకు అక్కడే బస చేయనున్నారు. నిన్న ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని నేరుగా కన్యాకుమారి చేరకున్న మోదీ ధ్యానం చేేయడానికి ఉపక్రమించారు. గత ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయన ధ్యానం చేశారు.
రేపటివరకూ...
కన్నాకుమారిలోని ప్రఖ్యాత రాక్ మెమోరియల్ చిహ్నాన్ని సందర్శించిన అనంతరం మోడీ నిన్న సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు. నాడు స్వామి వివేకానం దుడు కూడా ఇక్కడి ధ్యాన మండపంలోనే ధ్యానం చేశారు. కన్యాకుమారి విచ్చేసిన సందర్భంగా ఇక్కడి భగవతి అమ్మాన్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో మూడు రోజుల పాటు చేపల వేటను నిషేధించారు. భారీ భద్రతాఏర్పాట్లు చేశారు. పర్యాటకులను కూడా పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే రాక్ మెమోరియల్ ప్రాంతానికి అనుతిస్తున్నారు.
Next Story