Mon Dec 23 2024 06:15:29 GMT+0000 (Coordinated Universal Time)
యోగా తో మనసుకు ప్రశాంతం : నరేంద్ర మోదీ
శ్రీనగర్ లో ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు
శ్రీనగర్ లో ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనగర్ లోని డాల్ సరస్సు సమీపంలో నిర్వహించిన పదో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ పాల్గొన్నారు. యోగా చేసిన మోదీ తర్వత మాట్లాడుతూ పదేళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.
పదేళ్ల నుంచి...
2015లో తొలిసారి యోగా దినోత్సవాన్ని ప్రారంభించామని, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగాను నేర్పించడానికి అనేక సంస్థలు వెలిశాయన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. జమ్ము కాశ్మీర్ లో మోదీ పర్యటిస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని అనేక చోట్ల నిర్వహించారు.
Next Story