Thu Mar 27 2025 09:15:16 GMT+0000 (Coordinated Universal Time)
ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ పది గంటల పాటు సుదీర్ఘ రైలు ప్రయాణం చేసి ఉక్రెయిన్ కు చేరుకున్నారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన ముగిసింది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పది గంటల పాటు సుదీర్ఘ రైలు ప్రయాణం చేసి ఉక్రెయిన్ కు చేరుకున్నారు. మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు కీవ్ నగరానికి చేరుకుంది. ఏడు గంటలపాటు ఆయన పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మోదీ సమావేశమవుతారు.
భద్రతాపరమైన కారణాలతో...
అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ లో పాల్గొనే కార్యక్రమాలను భద్రతాపరమైన కారణాలతో గోప్యంగా ఉంచారు. ఉక్రెయిన్ -రష్యా మధ్య రెండేళ్ల నుంచి యుద్ధం కొనసాగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను రహస్యంగా ఉంచారు. అయితే ఆయన ఉక్రెయిన్ లో ఏడు గంటల పాటు ఉండనున్నారు. పోలండ్ లో నరేంద్ర మోదీ పర్యటన విజయవంతంగా ముగిసింది.
Next Story