Sun Dec 14 2025 23:17:42 GMT+0000 (Coordinated Universal Time)
Modi : సహకరించండి.. చివరి సమావేశాల్లో హుందాగా వ్యవహరించండి
బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండటం నారీశక్తి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండటం నారీశక్తి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. చివరి సమావేశాలు సజావుగా జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇన్ని రోజులు సభను అడ్డుకున్న వారు నిర్ణయాలను పునస్సమీక్షించుకోవాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా వారు ఆలోచించుకోవాలని ప్రధాని మోదీ కోరారు.
నూతన భవనంలో...
కొత్త పార్లమెంటు భవనంలో మొదటి బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెడతారని తెలిపారు. ఇది నారీ శక్తికి నిదర్శనమని చెప్పారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభా నిర్వహణకు అందరూ సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ మరొకసారి విపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
Next Story

