Mon Mar 31 2025 02:35:55 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు ప్రధాని మోదీ నామినేషన్
ప్రధాని నరేంద్ర మోదీ నేడు నామినేషన్ వేయనున్నారు. మూడోసారి ఆయన వారణాసి నుంచి పోటీ చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు నామినేషన్ వేయనున్నారు. మూడోసారి ఆయన వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఈరోజు నామినేషన్ ను వేసేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశాలు అందాయి.
వారణాసికి ఎన్డీఏ నేతలు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. ఆయన తన సతీమణితో కలసి వారణాసికి బయలుదేరి వెళ్లారు. ఈరోజు ప్రధాని నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం వారణాసికి బయలుదేరి వెళ్లారు. తర్వాత జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు.
Next Story