Mon Jan 06 2025 23:40:34 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు ఢిల్లీలో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. దాదాపు పన్నెండు వేల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంబిస్తారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. దాదాపు పన్నెండు వేల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలను కూడా చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు...
లోకల్ కనెక్టివిటీని మెరుగుపర్చడం, ప్రయాణ సౌకర్యాన్ని మరింతగా ప్రజలకు దగ్గరగా చేర్చడం వంటి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ కారిడార్ ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.అలాగే ఢిల్లీలోని రోహిణిలో ఆయుర్వేద పరిశోధన సంస్థ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story