Sun Dec 22 2024 23:52:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హిమాచల్ ప్రదేశ్ కు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. దాదాపు 11 వేల కోట్ల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఈరోజు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ కు కూడా మోదీ హాజరుకానున్నారు.
ప్రారంభోత్సవాలు....
మోదీ పర్యటనలో రేకాజీ డ్యామ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఏడు వేల కోట్లతో నలభై వేట మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ , హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లు కూడా లబ్ది పొందనున్నాయి. అలాగే లుహ్రీ ఫేజ్ వన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే మోదీ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story