Sun Dec 29 2024 04:35:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కర్ణాటకకు మోదీ
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. తుమకూరులో హెలికాప్టర్ ఫ్యాక్టరీని మోదీ ప్రారంభించనున్నారు. గ్రీన్ ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది. తుమకూరులో లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను హెచ్ఏఎల్ తయారు చేయనుంది.
హెలికాప్టర్ల తయారీ....
ఈరోజు ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. తర్వాత జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. కర్ణాటక ఎన్నికలు దగ్గరపడే సమయంలో మోదీ అనేక పర్యాయాలు పర్యటిస్తూ రాష్టంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో మోదీ నుంచి కేంద్ర మంత్రుల పర్యటనలు సాగుతున్నాయి.
Next Story