Mon Dec 23 2024 02:21:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభం
ప్రధాని నరేంద్రమోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బుందేల్ ఖండ్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. 296 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేను 14,850 కోట్ల రూపాయలతోనిర్మించారు. 2020లో ఈ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పూర్తిచేసుకుంది.
రికార్డు స్థాయిలో...
కేవలం 28 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఈ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించారు. జలౌన్ జిల్లాలోని తహసిల్ లోని కైతేరి గ్రామంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. చిత్రకూట్, ఇటావా మధ్య ఈ రహదారిఉంది. నాలుగు లేన్ల ఈ రహదారి నిర్మాణంతో ఉత్తర్ ప్రదేశ్ లో అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరింత మెరుగువుతుంది.
Next Story