Mon Dec 23 2024 16:58:52 GMT+0000 (Coordinated Universal Time)
వందో ఎపిసోడ్కు అంతా సిద్ధం
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. రేడియో ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన మనసులో ఉన్న విషయాలను పంచుకుంటారు.
మన్ కీ బాత్...
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం రేడియోలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయం సులువుగా చేరే అవకాశం ఏర్పడింది. ఆ నెలలో జరిగే అంశాలు, ప్రభుత్వ పధకాలు, విధానాలపై ప్రజలకు ప్రధాని స్వయంగా వివరించే ఈ కార్యక్రమం నేటితో వందో ఎపిసోడ్కు చేరుకుంది. ఈ సందర్భంగా అనేక మంది దేశ, అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Next Story