Mon Dec 23 2024 07:53:24 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురయింది. బిట్ కాయిన్లు లీగల్ చేశామంటూ హ్యాకర్లు ట్వీట్ చేశారు
ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురయింది. బిట్ కాయిన్లు లీగల్ చేశామంటూ హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఐదు వందల బిట్ కాయిన్లు పంచుతున్నామంటూ ట్వీట్ లో తెలిపారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే అప్రమత్తమయింది. ట్విట్టర్ కు ఫిర్యాదు చేసింది.
పీఎంవో అప్రమత్తం....
దీంతో ట్విట్టర్ వెంటనే ప్రధాని మోదీ అకౌంట్ ను రీస్టోర్ చేసింది. హ్యాకర్లు ఏకంగా ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ నే హ్యాక్ చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. ట్విట్టర్ అకౌంట్ కు భద్రత లేకుండా పోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలోనూ మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యకింగ్ కు గురైన సంగతి తెలిసిందే.
Next Story