Mon Dec 23 2024 12:12:23 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాధ్యాయురాలిని షూతో బాదిన ప్రిన్సిపాల్
ఉపాధ్యాయులే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు.. మహిళా ఉపాధ్యాయురాలిని షూతో బాదుతూ కనిపించాడు.
స్కూల్ లో పిల్లల మధ్య ఏవైనా గొడవలు వస్తే ఆపాల్సింది ఉపాధ్యాయులే..! కానీ ఆ ఉపాధ్యాయులే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు.. మహిళా ఉపాధ్యాయురాలిని షూతో బాదుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆలస్యంగా వచ్చినందుకు ఓ మహిళా టీచర్ని ప్రిన్సిపాల్ బూట్లతో కొట్టారు. లఖింపూర్లోని మహంగు ఖేరా పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై లఖింపూర్ ప్రాథమిక శిక్షా అధికారి (BSA) లక్ష్మీకాంత్ పాండే మాట్లాడుతూ.. వైరల్ వీడియో ఆధారంగా, ఆ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశామని అన్నారు.
News Summary - up-principal-thrashes-female-teacher-in-govt-school-video-goes-viral
Next Story