Fri Apr 25 2025 14:44:56 GMT+0000 (Coordinated Universal Time)
కుక్కల్లా మోకాళ్లపై నడిచేలా చేశారు.. ఎందుకో తెలుసా?
టార్గెట్లను చేరుకోలేకపోయినందుకు వారిని గొలుసులతో కట్టి

కేరళలోని కొచ్చిలోని ఒక ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనితీరు సరిగా లేని ఉద్యోగులను అమానుషంగా చూస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. టార్గెట్లను చేరుకోలేకపోయినందుకు వారిని గొలుసులతో కట్టిన కుక్కల్లా మోకాళ్లపై నడిచేలా చేశారు. నోటితో డబ్బులు తీసుకునేలా చేశారు. ప్రైవేట్ ఉద్యోగాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పే ఉదంతం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన కలూర్లో పనిచేస్తున్న ఒక ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో జరిగింది. అయితే సంస్థలో ఎటువంటి వేధింపులు జరగలేదని వీడియోలో ఉన్న వ్యక్తి మీడియాకు చెప్పాడు. పోలీసులు మాత్రం సదరు సంస్థ బుకాయిస్తోందని ఆరోపించారు. ఆ వీడియోలోని వ్యక్తి మాట్లాడుతూ.. "నేను ఇప్పటికీ సంస్థలో పనిచేస్తున్నాను. ఈ విజువల్స్ కొన్ని నెలల క్రితం నాటివి. అప్పట్లో సంస్థ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి బలవంతంగా రికార్డు చేశాడు. తరువాత యాజమాన్యం అతన్ని పదవి నుండి తొలగించింది. అతను ఇప్పుడు ఆ విజువల్స్‌ను ఉపయోగించి సంస్థ యజమానిని బెదిరిస్తున్నాడు" అని పేర్కొన్నారు. పోలీసులకు, కార్మిక శాఖ అధికారులకు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
రాష్ట్ర కార్మిక మంత్రి వి.శివన్కుట్టి ఈ విజువల్స్‌ను కలవరపరుస్తున్నాయని అన్నారు. కేరళ వంటి రాష్ట్రంలో దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని అన్నారు. హైకోర్టు న్యాయవాది కులత్తూర్ జైసింగ్ ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటనపై కేసు నమోదు చేసింది.
Next Story