Mon Dec 23 2024 14:38:42 GMT+0000 (Coordinated Universal Time)
మహిళా ప్రొఫెసర్ ను బెదిరించి.. న్యూడ్ కాల్ రికార్డు చేసి..
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన మయాంక్ సింగ్ అనే విద్యార్థి.. యూనివర్సిటీలోని ఓ మహిళ ప్రొఫెసర్‌తో తరచూ..
అశ్లీల చిత్రాల ప్రభావం.. విద్యార్థులు, యువతపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఫలితంగా చదువుకోవాల్సిన వయసులో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మాజీ విద్యార్థి.. మహిళా ప్రొఫెసర్ ను బెదిరించి.. నగ్నంగా వీడియో కాల్ చేయాలని డిమాండ్ చేసి, ఆ వీడియోను ఆమె భర్తకు పంపాడు. తనకు రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ యూనివర్సిటీలో వెలుగు చూడగా.. పోలీసులు విద్యార్థిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన మయాంక్ సింగ్ అనే మాజీ విద్యార్థి.. యూనివర్సిటీలోని ఓ మహిళ ప్రొఫెసర్‌తో తరచూ ఇన్‌స్టాగ్రాంలో చాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత నేరుగానే ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇటీవలే ఆమెకు వీడియోకాల్ చేసి.. తాను చెప్పినట్లు చేయకపోతే తమ చాటింగ్ స్క్రీన్ షాట్లను బయటపెడతానని బెదిరించాడు. దాంతో భయపడిన ప్రొఫెసర్.. ఆ విద్యార్థి చెప్పినట్టే వీడియో కాల్ లో నగ్నంగా మారింది. ఆ కాల్ ను రికార్డు చేసిన నిందితుడు.. వీడియో ఆమె భర్తకు పంపించి రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. దాంతో పోలీసులను ఆశ్రయించిన ప్రొఫెసర్ దంపతులు విద్యార్థిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story