Mon Dec 23 2024 01:35:57 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ తో కలసి టీఆర్ఎస్ నిరసన
పార్లమెంటు లో వివక్షాల నిరసనలు రెండోరోజూ జరిగాయి. ధరల పెంపుదలను నిరసిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి
పార్లమెంటు లో వివక్షాల నిరసనలు రెండోరోజూ జరిగాయి. ధరల పెంపుదలను నిరసిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటు వాయిదా పడటంతో విపక్షాలు పార్లమెంటు బయట గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతలు ఆందోళనలో పాల్గొన్నారు.
జీఎస్టీ పెంపుపై...
నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడంపై జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ తో కలసి టీఆర్ఎస్ పాల్గొనింది. రాహుల్ గాంధీ పక్కనే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నిల్చుని నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ తో కలసి ధర్నాకు దిగడం ఒక ఎత్తైతే, రాహుల్ పక్కనే నిలబడి టీఆర్ఎస్ అగ్రనేత కేకే నిల్చోవడం పై ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. అన్ని విపక్ష పార్టీలు నిరసనలో పాల్గొనడంతోనే తాము పాల్గొన్నామని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు.
Next Story