Mon Dec 23 2024 10:07:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు శ్రీహరి కోటలో పీఎస్ఎల్వీ సీ 59 రాకెట్ ప్రయోగం
నేడు శ్రీహరి కోటలో పీఎస్ఎల్వీ సీ 59 రాకెట్ ప్రయోగం జరగనుంది. ని
నేడు శ్రీహరి కోటలో పీఎస్ఎల్వీ సీ 59 రాకెట్ ప్రయోగం జరగనుంది. నిన్న జరగాల్సిన రాకెట్ ప్రయోగం సాంకేతక లోపం ఉండటంతో నేటికి వాయిదా వేశారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ 59 రాకెట్ ను ప్రయోగించనున్నారు. కౌంట్ డౌన్ ను విజయవంతంగా ముగించుకున్నప్పటికీ నిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో నేటికి వాయిదా వేశారు.
సూర్యుడిపై పరిశోధనలను జరిపేందుకు...
శ్రీహరికోట లోని సతీష్ ధావన్ సెంటర్ నుంచి నేడు పీఎస్ఎల్వీ సీ 59 రాకెట్ ను ప్రయోగించనున్నారు. సూర్యుడిపై ప్రత్యేక పరిశోధనలను జరిపేందుకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ రాకెట్ ద్వారా యూరోపియ్ స్పేస్ ఏజెన్సీకి చెందని ప్రోబా -3 మిషన్ ను ప్యోగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగుగంటల పన్నెండు నిమిషాలకు సతీష్ థావన్ సెంటర్ నుంచి నింగిలోకి రెండు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహాలు వెళ్లనున్నాయి.
Next Story