Mon Dec 23 2024 17:38:18 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీని తరిమి కొట్టాల్సిందే
పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.
పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఇండియాలో అధికార మార్పిడి అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు. ఎప్పుడూ కాలం ఒక్కలా ఉండదని భగవంత్ మాన్ అభిప్రాయ పడ్డారు. ఆశీర్వదించిన ప్రజలే తిరస్కరించిన ప్రభుత్వాలను అనేకం చూశామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని భగవంత్ మాన్ అన్నారు.
ప్రమాదకరంగా మారి...
దేశానికి ప్రమాదకారిగా బీజేపీ మారిందన్నారు. బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. విపక్షాలను సయితం కేసులతో భయపెట్టడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్ లో కూడా ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరం చేస్తున్నారని భగవంత్ మాన్ ఆరోపించారు. దేశాన్ని భ్రష్టుపట్టించడంలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందన్నారు.
Next Story