Wed Apr 09 2025 06:19:55 GMT+0000 (Coordinated Universal Time)
పూరీ జగన్నాధ రథయాత్ర ప్రారంభం
పూరి జగన్నాధ రథయాత్ర నేడు ప్రారంభమైంది. పూరీ నగరం భక్తులతో కిక్కిరిసి పోయింది.

పూరి జగన్నాధ రథయాత్ర నేడు ప్రారంభమైంది. పూరీ నగరం భక్తులతో కిక్కిరిసి పోయింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పూరీ జగన్నాధ రథయాత్ర జరగలేదు. ఈసారి భక్తులకు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించడంతో నిన్నటి నుంచే పూరీ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.
లక్షల సంఖ్యలో..
ఈ యాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. దీంతో ఐదంచెల భద్రతను పోలీసులు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా తొక్కిసలాట జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి రధయాత్రకు పదిహేను లక్షల మంది భక్తులు పాల్గొంటారని చెబుతున్నారు.
Next Story