Thu Nov 21 2024 22:38:36 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ గాంధీ సన్ స్క్రీన్ ముచ్చట్లు విన్నారా..?
భారత్ జోడో యాత్రలో పాల్గొనేవారు బళ్లారి సమీపంలోని క్యాంప్‌సైట్‌లో ఇటీవల విరామం తీసుకున్నారు. అందులో కొందరు మాట్లాడాలని రాహుల్ గాంధీ చుట్టూ గుమిగూడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఓ వీడియోను పార్టీ సోషల్ మీడియా విభాగం విడుదల చేసింది. పార్టీ కార్యకర్తలతో రాహుల్ గాంధీ ముచ్చటించడం ఈ వీడియోలో చూడొచ్చు. పాదయాత్ర ముగిసిన తర్వాత సాయంత్రం వేళ తమకు ఏర్పాటు చేసిన శిబిరంలో రాహుల్ పార్టీ కార్యకర్తల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీని మీరు ఏ సన్ స్క్రీన్ వాడుతారో చెప్పాలంటూ కార్యకర్తలు అడగడం.. అందుకు రాహుల్ సమాధానాలు చెప్పడం కూడా వినవచ్చు..
"మీరు ఏ సన్‌స్క్రీన్ ఉపయోగిస్తున్నారు?" అని ఒక కార్యకర్త అడగ్గా.. తాను ఎలాంటి సన్‌స్క్రీన్‌ను ఉపయోగించనని, తన చర్మం రంగులో ఉన్న తేడాను చూపించడానికి రాహుల్ తన టీ-షర్ట్ స్లీవ్లను పైకి పట్టుకుని చప్పించారు. "మా అమ్మ సన్‌స్క్రీన్ పంపింది, కానీ నేను దానిని ఉపయోగించడం లేదు," అని రాహుల్ గాంధీ చెప్పడం విశేషం. చాలా దూరం నడుస్తుంటాం కాబట్టి బొబ్బలు వంటి సమస్యలు ఉన్నాయా అని అడగ్గా.. రాహుల్ గాంధీ స్పందిస్తూ మీలో ఎవరికైనా బొబ్బలు వచ్చాయా? నాక్కూడా రాలేదని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది. ఇవాళ ఆదోని మండలం చాగి గ్రామం నుంచి జోడో యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఉదయం 7 గంటలకు చాగి గ్రామం నుంచి మొదలు పెట్టి నారాయణపురం, డాణాపురం మీదుగా ఆదోని పట్టణం దగ్గరలో ఏర్పాటు చేసిన విశ్రాంతి శిబిరానికి చేరుకుంటారు. ముందుగానే అనుమతి తీసుకున్న వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతారు. అనంతరం ఇక్కడే పాత్రికేయుల సమావేశంలో రాహుల్ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి ఆదోని పట్టణ వీధులు, బైచిగేరి మీదుగా ఆరేకల్లు వరకు సాగిస్తారు. 6:30 గంటలకు ఆ గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. రాత్రి ఎమ్మిగనూరు మండలం బనవాసిలో రాహుల్ బస చేయనున్నారు.
Next Story