Mon Dec 23 2024 19:03:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆరోజు జోడో యాత్రకు బ్రేక్
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు ఈ నెల 17వ తేదీన విరామం ప్రకటించనున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు ఈ నెల 17వ తేదీన విరామం ప్రకటించనున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఆరోజున కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ లో పాల్గొంటారు. రాహుల్ పాదయాత్రలో ఉన్న దాదాపు నలభై మంది నేతలు కూడా బళ్లారి ప్రాంతంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆరోజు విరామం ఇచ్చిన అనంతరం ఈ నెల 18వ తేదీన తిరిగి భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది.
అక్కడే పోలింగ్ కేంద్రం....
ఇందకోసం యాత్ర జరిగే ప్రాంతంలోనే పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నాలుగు రోజులు పూర్తయిన తర్వాత తిరిగి కర్ణాటకలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి తెలంగాణలోకి భారత్ జోడోయాత్ర ప్రవేశిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభిస్తుండంటంతో కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది.
Next Story